
మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై ‘కూటమి’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ ఎంఎన్.హరేంధిరప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. వైకాపా కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా పార్టీని వీడడంతో ‘కూటమి’ బలం పెరిగింది. జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యులు ఉన్నారు. సమావేశానికి ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిపి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. వీరంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేయగా.. కౌన్సిల్ సమావేశాన్ని వైకాపా సభ్యులు బహిష్కరించారు. దీంతో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పదవిని కోల్పోయారు.
జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండగా, 21వ డివిజన్ కార్పొరేటర్ వంశీకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఎక్స్ అఫిషియో సభ్యులు 16 మంది ఉండగా, 11 మంది కూటమి వైపే ఉన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీకి నలుగురి బలం ఉంది. కార్పొరేటర్లు జనసేనకు 14 , బీజేపీకి ఇద్దరు, టీడీపీకి 48 మంది కలిసి మొత్తం 75 మంది వరకు సంఖ్యాబలం ఉండగా, సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. ఇలా వుండగా అవిశ్వాస తీర్మాన పరీక్ష నేపథ్యంలో జీవీఎంసీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు భద్రత కల్పించారు.
ఇవి కూడా చదవండి ..
-
సూర్యాపేటలో ఫేక్ హాస్పిటల్.. డాక్టర్ పై ఫోర్జరీ కేసు
-
నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!
-
అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్
-
సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్
-
ఏపీలో లిక్కర్ స్కామ్ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్ వైపుకా..!