
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును (APGVB).. తెలంగాణలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో (TGB) విలీనం చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు తెలంగాణలో ఉన్న 493 ఏపీజీవీబీ శాఖలు.. టీజీబీలో విలీనం అవుతాయి. మరోవైపు తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖలు 435 ఉండగా.. రూ. 30 వేల కోట్ల వ్యాపారం నడుస్తుంది. ఇప్పుడు విలీనం తర్వాత మొత్తం 928 శాఖలతో.. రూ. 70 వేల కోట్ల వ్యాపారంతో వినియోగదారులకు టీజీబీ సేవలు అందించనుంది. విలీన ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి జనవరి 1 వరకు జరగనుంది. ఇక విలీన నిర్ణయం.. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. విలీనం తర్వాత.. దేశంలోని అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు అవతరించనుంది. గ్రామీణ బ్యాంకుల్ని మరింత పట్టిష్టపర్చే ఉద్దేశంతో.. కేంద్రం ‘ఒకే రాష్ట్రం.. ఒకే గ్రామీణ బ్యాంకు’ నినాదం నేపథ్యంలోనే విలీనం జరుగుతోంది.
Read Also : తెలంగాణ సచివాలయంపై జాతీయ పతాకం అవనతం…వారం రోజుల పాటు అధికారిక వేడుకలు రద్దు
విలీన ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో.. ఈ నెల అంటే డిసెంబర్ 28 నుంచి 31 వరకు బ్యాంక్ కార్యకలాపాల్లో అంతరాయం ఉంటుందని ఏపీజీవీబీ, టీజీబీ రెండూ.. తమ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా స్పష్టం చేశాయి. విభజన క్రమంలో ఏర్పడే సాంకేతిక సమస్యల కారణంగా అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు 4 రోజులు అందుబాటులో ఉండకపోవచ్చని వెల్లడించాయి. ఇందులోనే మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం, ఖాతాదారుల సేవా కేంద్రాలు వంటివి కూడా ఉంటాయని.. అందుకోసం కస్టమర్లు సహకరించాలని తెలిపాయి.ఇప్పటికే బ్యాంకు కస్టమర్లకు వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా సంబంధిత సమాచారం తెలియజేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఏపీజీవీబీ బోర్డుల స్థానంలో టీజీబీ బోర్డులు సిద్ధం చేస్తున్నారు. టీజీబీ ఇప్పటివరకు వరంగల్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించగా.. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా సేవలు అందించనుంది. అయితే ఏపీజీవీబీ- టీజీబీ విలీనం నేపథ్యంలో అకౌంట్ నంబర్లు మారవు. ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ మారుతుంది.
ఇవి కూడా చదవండి :
- శబరిమల ఆలయం మూసివేత!… మకర జ్యోతి ఎప్పుడో తెలుసా?
- మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. తేదీలు ఖరారు!
- మిస్టర్ రేవంత్.. నీకెవడు భయపడడు.. రెచ్చిపోయిన హీరోయిన్
- బన్నీ పై నాకెందుకు కోపం!… చట్టపరంగానే వ్యవహరించా: సీఎం
- శ్రీశైల దేవస్థానం సరి కొత్త నిబంధన… ఇక నుండి వాటిపై నిషేధం