తెలంగాణ

అల్లు అర్జున్ పై నాకేం కోపం లేదు.. సీఎం రేవంత్ క్లారిటీ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందటం, ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి హాస్పిటల్ చేరడం వంటివి ఇండస్ట్రీలో తీవ్ర కలకలం సృష్టించాయి. దీంతో ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఖండించింది.

అంతేగాకుండా అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సంచలనం వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం రేవంత్ తో అల్లు అర్జున్ కి విభేదాలు ఉన్నాయని అందుకే కక్ష్యపూరిత చర్యలకి పాల్పడుతున్నారని కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అంతేగాకుండా సీఎం రేవంత్ కి వ్యతిరేకంగా నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు.

Read More :  జనవరి 7న కేటీఆర్ అరెస్ట్? ఫార్ములా కేసులో ఈడీ నోటీస్

ఈ విషయంపై సీఎం రేవంత్ ప్రెస్ మీట్ లో స్పందించారు. ఇందులో భాగంగా నాకు అల్లు అర్జున్ కి మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. అలాగే అల్లు అర్జున్ తోపాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా నాకు మంచి సన్నహితులని గతంలో మేమందరం కలసి తిరిగేవాళ్లమని పాతరోజులు గుర్తు చేసుకున్నాడు.

అలాగే సామాన్య ప్రజలైన, సినీ సెలెబ్రెటీఅయినా అందరూ చట్టానికి సమానమేనని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరి ఇప్పటికైనా అల్లు అర్జున్, సీఎం రేవంత్ కాంట్రవర్సీ కి పులిస్టాప్ పడుతుందో లేదో చూడాలి.

  1. సినిమా చూపిస్త బిడ్డా.. సీఎం రేవంత్‌కు కవిత మాస్ వార్నింగ్
  2. తెలంగాణకు టీటీడీ ప్రాధాన్యత ఇవ్వాలి.. మంత్రి కొండా సురేఖ
  3. శ్రీశైల దేవస్థానం సరి కొత్త నిబంధన… ఇక నుండి వాటిపై నిషేధం
  4. నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు…”ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వార్”గా ఘనత
Back to top button