
-వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది
-భార్యను, కూతురిని, వదినను కొడవలితో దాడిచేసి హత్య
-అనంతరం ఇంట్లో ఉరివేసుకుని యాదయ్య ఆత్మహత్య
క్రైమ్ మిర్రర్, వికారాబాద్:- భార్య మీద అనుమానముతో ఓ ప్రబుద్ధుడు కట్టుకున్న భార్యను కూతుర్ని వదినను కొడవలితో దాడి చేసి ముగ్గురుని హత్య చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం అతను కూడా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు వివరాలలోనికి వెళితే
.. వికారాబాద్ జిల్లా, కుల్కచర్ల మండల కేంద్రంలో వేపూరి యాదయ్య కూలి పని చేస్తూ జీవనం సాగించేవారు. అతని భార్య అలవేలుపై ఎప్పుడు అనుమాన పడేవారు అని మూడు రోజులుగా గ్రామంలో భార్య భర్తల మధ్య పంచాయతీ జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. భార్య భర్తల మధ్య రాజి కుదుర్చడానికి వదిన హన్మమ్మ వచ్చింది. అతని భార్యపై అనుమానంతో ఆదివారం మధ్య రాత్రిలో భార్య అలవేలు (32) ఇద్దరు కూతుర్లు శ్రావణి అపర్ణ (13) వదిన హన్మమ్మ(40) కొడవలితో నరికి హత్య చేశాడు.అనంతరం యాదయ్య (38) తాను కూడా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పెద్ద కుమార్తె అపర్ణ గాయాలతో తప్పించుకొని పారిపోయి స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే రక్తం మడుగులో చనిపోయిన భార్య కుమార్తె వదిన, యాదయ్య ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు కారణం ఏమిటో ఇంకా తెలియాల్సి ఉందని పరిగి డిఎస్పి శ్రీనివాస్ స్థానిక ఎస్సై వి.రమేష్ కుమార్ ఆరా తీస్తున్నారు. పోస్టు మార్డo నిమిత్తం శవాలను పరిగి ఆసుపత్రికి తరలించారు.
Read also : మా నాన్న ఏ తప్పు చేయలేదు.. కక్ష సాధింపులుతోనే ఇలా చేస్తున్నారు : జోగి రాజీవ్
Read also : భారత్ సూపర్ విక్టరీ.. అప్పుడే అయిపోలేదు?





