Terrace Garden Farmer Nallapati Mamata Felicitation: చాలా మందికి వ్యవసాయం చేయాలనే మక్కువ ఉన్నా, అందుకు తగిన అనుకూలతలు లేవనే కారణంతో వెనక్కి తగ్గుతారు. కానీ, కొంత మంది వ్యవసాయాన్ని ఆసక్తిగా మార్చుకుని, ఉన్న సదుపాయాలను తమకు అనుగుణంగా మార్చుకుటారు. అలాంటి వారిలో ఒకరు సూర్యాపేటకు చెందిన నల్లపాటి మమతా శ్రీకాంత్. ఈమె తన ఇంటి టెర్రస్ ను గార్డెన్ గా మార్చి బోలెడు పంటలు పండిస్తున్నారు. టెర్రస్ గార్డెన్ ఫార్మర్ గా అందరి ప్రశంసలు దక్కించుకుంటున్నారు.
కూరగాయల నుంచి పూలు, పండ్ల వరకు..
మమత తన టెర్రస్ గార్డెన్ లో రకరకాల పంటలు సాగు చేస్తున్నారు. కూరగాయలు, ఆకు కూరలతో పాటు పండ్లు పండిస్తున్నారు. తన టెర్రస్ గార్డెన్ ను పక్షలు డిస్ట్రబ్ చేయకుండా పూర్తి ఐరన్ ఫ్రేమ్ ఏర్పాటు చేయించారు. పైభాగంలో గ్రీన్ నెట్ కట్టి తీగ పంటలు సాగు చేస్తున్నారు. గార్డెన్ కు అవసరమైన నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి, డ్రిప్ లింక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె టెర్రస్ గార్డెన్ లో పలు రకాల పూలు, పండ్లు, కూరగాయలు, పండ్లు సాగు అవుతున్నాయి.
రైతుల దినోత్సవం సందర్భంగా సన్మానం
తాజాగా గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాతీయ రైతుల దినోత్సవం ఘనంగా జరిగింది. అక్కడ నిర్వహించిన కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శనలో ఆటారీ డైరెక్టర్ షేక్ మీరా,జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెర్రస్ గార్డెన్ ఫార్మర్ నల్లపాటి మమతా శ్రీకాంత్ ను ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, మెమొంటో అందజేశారు. మమత లాగే మహిళలంతా మిద్దెతోటలను సాగు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నంద్ లాల్, డైరెక్టర్ అటారి జోన్ -10 షేక్ ఎన్ మీరా సూచించారు. ఇంటి పంటలు ఆరోగ్యాన్ని కాపాడుతాయన్నారు.





