
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- సాధారణంగా చలికాలంలో ఆయా ప్రాంతాలలో తీవ్రమైన చలి అలాగే మంచు గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు దక్షిణాది రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఏర్పడుతూ ఉంటాయి. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు జిల్లా ఏజెన్సీలో మంచు గడ్డలు ఏర్పడడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఏపీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు కూడా చలి తీవ్రత అనేది పెరుగుతూ పోతుంది. ఇక ఈరోజు అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఉష్ణోగ్రత అనేది నాలుగు డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు చలికి వణికి పోతున్నారు.
Read also : Tollywood: ‘ఈ వయసులో అవసరమా?’ అన్న ట్రోలర్స్‌కి గట్టిగా ఇచ్చిపడేసిన ప్రగతి
ఇక అరకు, మారేడుమిల్లి అలాగే రామవరం వంటి మండలాల్లో మంచు వర్షం కురుస్తుంది. దీని దాటికి మాడుగల మండలం సొలభం గ్రామ పరిసరాలలో మూడు రోజుల నుంచి మంచు గడ్డలు ఏర్పడుతున్నాయి అని ఆ గ్రామ రైతులు చెబుతున్నారు. కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లోనే కనిపించేటటువంటి ఈ దృశ్యాలు తాజాగా మన రాష్ట్రంలో కూడా కనిపించడంతో ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాదిలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గిపోయాయి అని ఇప్పటికే అధికారులు చెప్తూనే పలు సందర్భాలలో జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. దీంతో చాలామంది కూడా ఆ మంచు గడ్డలు ఏర్పడిన ప్రాంతాలకు వెళ్లి ఫోటోలు మరియు వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Read also : నకిలీ విత్తనాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం?





