అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప -2 సినిమా ప్రీమియర్స్ షో సందర్భంగా హైదరాబాదులోని సంధ్య థియేటర్ లో తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే మహిళ చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే రేవతి కుమారుడు కూడా ప్రస్తుతం చావు అంచుల మధ్య పోరాడుతున్నాడు. ఈ ఘటనలు భాగంగానే అల్లు అర్జున్ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తిరిగి వెంటనే బేయిల్ ద్వారా ఇంటికి రావడం కూడా జరిగింది.
Read More : ఈనెల 21వ తారీకున అద్భుతం జరగబోతోంది!… ఏంటంటే?
ఇక తాజాగా ఈ తొక్కిసలాటలో గాయపడిన శ్రీ తేజ్ ను ఇవాళ డైరెక్టర్ సుకుమార్ పరామర్శించారు. హాస్పిటల్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వైద్యులను అడిగి మరీ బాలుడి ఆరోగ్య పరిస్థితులపై కొంచెం సేపు ఆరా తీశారు. ఎంత ఖర్చు అయినా సరే అల్లు అర్జున్ మరియు పుష్పా టీం మొత్తం భరిస్తామని చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఇక తాజాగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా శ్రీ తేజను పరామర్శించిన విషయం తెలిసిందే.
Read More : తెలంగాణలో చలి విజృంభన!.. రాబోయే రెండు రోజులు జాగ్రత్త?
ఇక తొక్కిసలాటలో చనిపోయిన మహిళకు అలాగే తన కుటుంబానికి అల్లు అర్జున్ 25 లక్షలు ప్రకటించాడు. ఇక కుటుంబ బాధ్యత అంతా కూడా పుష్ప టీం తీసుకుంటుందని డైరెక్టర్ సుకుమార్ మరియు అల్లు అర్జున్ చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనం సృష్టించాయి. ఒకవైపు పుష్ప సినిమా భారీ సక్సెస్ అందుకుంటుండగా డైరెక్టర్ కు అలాగే అల్లు అర్జున్కి మాత్రం ఇది ఒక సాడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక ఈ సంఘటనలపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లు రూపంలో తెలియజేయండి.