నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
– సబ్ కలెక్టర్ ఎం. నారాయణ్ అమిత్
మిర్యాలగూడ, క్రైమ్ మిర్రర్: రాష్ట్రంలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మిర్యాలగూడ మునిసిపల్ వార్డుల నామినేషన్ కేంద్రాలను బుధవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఎం. నారాయణ్ అమిత్ పరిశీలించారు.ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ చేపట్టిన ఏర్పాట్లు, హెల్ప్‌డెస్క్ పనితీరును పరిశీలించారు.
నామినేషన్ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా సాగేందుకు అవసరమైన సూచనలు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు అందించారు. అభ్యర్థులు, ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ జి. శ్రీనివాస్, తహసీల్దార్ పి. శ్రీనివాస్, డీఈఈ వెంకన్న, మేనేజర్, రెవిన్యూ ఆఫీసర్ జి. జ్ఞానశ్వరి, మాస్టర్ ట్రైనర్స్ బాలు, గుడిపాటి కోటయ్య పాల్గొన్నారు. అలాగే ఒన్, టూ టౌన్ ఇన్స్పెక్టర్లు నాగభూషణరావు, సోమనర్సయ్యల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు.





