Monday, March 9, 2026
Homeజాతీయంవిద్యార్థ‌లు లక్ష్యంతో చ‌దివి ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాలి

విద్యార్థ‌లు లక్ష్యంతో చ‌దివి ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాలి

  • ప‌రీక్ష సామాగ్రి అంద‌జేత‌

శాలిగౌరారం , క్రైమ్ మిర్ర‌ర్ః విద్యార్థులు ప‌ట్టుద‌ల‌తో చ‌దివి ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించి పాఠ‌శాల‌కు, త‌ల్లిదండ్రుల‌కు మంచి పేరు తీసుక‌రావాల‌ని అడ్లూర్ గ్రామ సర్పంచ్ కట్ట లక్ష్మి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు. శాలిగౌరారం మండలం అడ్లూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చ‌దువుతున్న ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులకు సోమ‌వారం బోడ యాకోబ్, బోడ సల్మాన్ కుటుంబ సభ్యులు పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విలువైన సూచనలు చేశారు. పదో తరగతి అనేది విద్యార్థి జీవితంలో కీలక దశ అని, క్రమశిక్షణతో చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. విద్యార్థులు ప‌రీక్ష‌లు బాగా రాయాల‌ని ఈ సంద‌ర్భంగా ఆల్‌ది బెస్ట్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శాలిగౌరారం మండలం మాజీ అధ్యక్షులు కట్ట వెంకట్ రెడ్డి,పాఠశాల ఉపాధ్యాయులు వెంకటా చారీ, మాజీ సర్పంచ్ బోడ నర్సింహా, బీఆర్ఎస్ పార్టీ అడ్లూర్ గ్రామ శాఖ అధ్యక్షులు దొనకొండ ఆంజనేయులు,బోడ శేఖర్, బోడ రవీందర్, బోడ సాగర్, బోడ మణి కుమార్, బోడ మనిదర్, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments