
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- ఈ మధ్యకాలంలో విద్యార్థులు కూడా తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ … చెత్త పనులు చేసి జైలు పాలు అవుతున్న సంఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కాలేజీలో BCA చదువుతున్నటువంటి ఇద్దరు విద్యార్థులు ఫేక్ లెటర్ సృష్టించి చివరికి దొరికిపోయారు. ఈ లెటర్ లో ప్రిన్సిపల్ అనామిక నేడు హఠాత్తుగా చనిపోయారని… ఈనెల 15 మరియు 16 ను జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లుగా రాశారు. ఈ లెటర్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా క్షణాల్లోనే వైరల్ అయింది. చివరికి కళాశాల హెడ్ ఈ లెటర్ ని చూసి చివరికి పోలీసులకు తెలియజేశాడు. దీంతో కళాశాలకు చేరుకున్న పోలీసులు ఆ విద్యార్థులపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా కాలేజీ నుంచి దాదాపు రెండు నెలలపాటు సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు చేస్తే మూడేళ్ల పాటు జైలు శిక్ష కూడా పడుతుంది అని అధికారులు యువతకు హెచ్చరించారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం సంచలనంగా మారి అందరి దృష్టిపడింది.. కాబట్టి ఇలాంటి ఫేక్ లెటర్లను ఉపయోగించి అలాంటి పనులు చేయొద్దని… ఒకవేళ అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.
Read also : అందరి దృష్టి వీళ్ళిద్దరిపైనే… ఎందుకంటే?
Read also : ఋతుపవనాల ఎఫెక్ట్… ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు





