
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీసీ సంఘాల నేతలతో పాటుగా పలువురు రాజకీయ నాయకులు ఈ బంద్ లో పాల్గొననున్నారు. అయితే రేపు బంద్ పేరిట ఎవరైనా సరే అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని DGP శివధర్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. బంద్ జరుగుతున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అలాగే నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటాయని తెలిపారు. బంద్ కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. కచ్చితంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని… రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల నేతలు రేపు బంద్ చేపట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ బంద్ కు కాంగ్రెస్, బీఆర్ఎస్ , బిజెపి అలాగే సిపిఐ & సిపిఎం సహా అన్ని పార్టీలు కూడా మద్దతిస్తున్నామని ప్రకటించాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అందరూ కలిసి ఈ బీసీ రిజర్వేషన్ల కోసం తెగ పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున నాయకులు అలాగే ప్రజలు కూడా పాల్గొనే అవకాశాలు ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అలాగే తొక్కిసులాటలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే ఓవరాక్షన్ చేసిన.. లేదా ప్రజలకు హాని కలిగించేలా వ్యవహరించిన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి తీవ్రంగా హెచ్చరించారు.
Read also : బీసీ రిజర్వేషన్లను BJPనే అడ్డుకుంటుంది : భట్టి విక్రమార్క
Read also : నాలుగు సార్లు వచ్చినా… జగన్ పేరే ఎత్తలేదు!.. కారణం ఏంటో తెలుసా?