క్రైమ్తెలంగాణ
Trending

మిర్యాలగూడలో నేరాలపై కఠిన చర్యలు - డీఎస్పీ రాజశేఖర్ రాజు

  • నేరం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించం

  • న్యాయ వ్యవస్థపైన ప్రజల నమ్మకం పెరగాలి

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్‌లో డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో పోలీస్ వ్యవస్థకు కొత్త ఉత్సాహం వచ్చింది. టెక్నాలజీ ఆధారిత దర్యాప్తు, ప్రజా భాగస్వామ్యం, మరియు క్రమశిక్షణ కలయికతో ఈ డివిజన్ ఇప్పుడు సేఫ్ జోన్గా నిలుస్తోంది. గత కొద్ది నెలలుగా పోలీసు వ్యవస్థ చురుకుదనంతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. క్రైమ్ మిర్రర్ ప్రతినిధితో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు…. , నేరాల తీరును, సాంకేతిక దర్యాప్తు పద్ధతులు, ప్రజల భాగస్వామ్యం పై వివరాలు పంచుకున్నారు.

మిర్యాలగూడలో నేరాలను పూర్తిగా నియంత్రణలోకి తెచ్చాం… మునుపు మిర్యాలగూడ ప్రాంతం చిన్నచిన్న దొంగతనాలు, మద్యం స్మగ్లింగ్, గ్యాంబ్లింగ్ కేసులతో ఇబ్బంది పడేది. గత ఆరు నెలల్లో మేము సమగ్ర ఆపరేషన్ క్లిన్-ట్రాక్ నిర్వహించి, 180 మందికి పైగా నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చాం. క్రమంగా మోసాలు, కిడ్నాప్‌లు, దాడుల కేసులు తగ్గుముఖం పట్టాయి,” అని రాజశేఖర్ రాజు తెలిపారు. సాంకేతిక దర్యాప్తు కొత్త పంథాలో ప్రతి కేసును ఇప్పుడు సాంకేతిక ఆధారాలతో పరిశీలిస్తున్నాం.

Also Read : వడ్డీ బాధితుడి ఆత్మహత్యతో ఉద్రిక్తత – పలుగుతండాలో బాలాజీ గృహంపై దాడి

సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ డేటా, డిజిటల్ సాక్ష్యాలు ఇవి ఇప్పుడు మా దర్యాప్తు ప్రధాన ఆయుధాలు. ఇటీవల మేము చేధించిన రెండు దొంగతన కేసుల్లో 48 గంటల్లో నిందితులను పట్టుకోవడంలో ఈ సాంకేతిక వ్యవస్థే కీలక పాత్ర పోషించింది, అని ఆయన వివరించారు. నేరస్థులు మారితేనే సమాజం సురక్షితం మేము కేవలం అరెస్టులు చేయడం మాత్రమే కాదు, రీఫార్మేషన్ దిశగా అడుగులు వేస్తున్నాం. మునుపటి దొంగలు, మద్యం స్మగ్లర్లు ఇప్పుడు స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహిస్తున్నాం. పోలీస్ డిపార్ట్‌మెంట్ కేవలం శిక్షించే వ్యవస్థ కాదు మార్పు తీసుకువచ్చే వ్యవస్థ, అని డీఎస్పీ అన్నారు..

ఆంధ్ర బోర్డర్, నల్లగొండ, సూర్యాపేట సరిహద్దుగా ఉన్న ఈ డివిజన్‌లో విభిన్న నేర ధోరణులు ఉంటాయి. కానీ మా బృందం 24 గంటలు ఫీల్డ్‌లో ఉంటుంది. ప్రతి ఇన్‌స్పెక్టర్‌కి ప్రత్యేక బీట్ అసైన్‌మెంట్ ఇచ్చాం. ఎక్కడైనా సంఘటన జరిగితే 15 నిమిషాల్లో రీస్పాన్స్ ఇవ్వడం మా నిబంధన, అని ఆయన చెప్పారు.  ప్రజల సహకారం లేకుండా శాంతి సాధ్యం కాదు.. ప్రజలు పోలీస్‌కి సమాచారమిస్తే, నేరాలు సులభం అవుతుంది. పోలీస్ లు మీ మిత్రుడు అనే భావనను మేము వాస్తవం చేస్తున్నాం. ప్రతి నెలా మీత్ర్ సమావేశాలు, మెహిలా భద్రతా అవగాహన కార్యక్రమాలు, సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ కాంపెయిన్‌లు నిర్వహిస్తున్నాం, అని రాజశేఖర్ రాజు తెలిపారు.

మరిన్ని వార్తలు చదవండి …

  1.  ఏసీబీ వలలో రెవిన్యూ తిమింగలం..! లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మార్వో

  2. యాదాద్రి భువనగిరిలో దారుణం..! హోంగార్డుపైకి దూసుకెళ్లిన లారీ

  3. మైనర్ బాలిక హత్య కేసు – దూకుడు పెంచిన డీఎస్పీ శివరాం రెడ్డి

  4. నల్లగొండ వైద్యుల నిర్లక్ష్యం.! – గర్భిణి గర్భంలోనే పసికందు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button