
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొంథా తుఫాన్ పొంచి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ తీరం దాటినప్పటికీ కూడా ఇప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా వాగులు మరియు వంకలు పొంగిపొర్లుతూ ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వరద ముప్పు ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల నుంచి చాలామందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే ఈ పునరావాస కేంద్రాలకు తరలించిన వారికి అన్ని సదుపాయాలను కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం.
Read also : భారీ వర్షాలు….. ఆదర్శంగా నిలిచిన దేవరకొండ కోర్టు సిబ్బంది
ఇక తాజాగా తుఫాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆర్థిక సహాయం చేయాలని ప్రకటించారు. పునరావాస కేంద్రాలకు వచ్చిన వారందరికీ కూడా ఒక్కొక్కరి చొప్పున 1000 రూపాయలను అందజేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉంటే గరిష్టంగా వారికి మూడు వేల రూపాయలను అందజేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డబ్బు మొత్తాన్ని కూడా పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వారి చేతికి అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. చంద్రబాబుపై అలాగే కూటమి ప్రభుత్వంపై పునరావాస కేంద్రాల్లో నివాసం ఉన్నటువంటి వారు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
Read also : సోషల్ మీడియా ట్రోల్ల్స్ పై దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన శ్రీ లీల





