
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమ అందాలకి తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది అని ఇన్ డైరెక్ట్ గా మాట్లాడిన వ్యాఖ్యల పై తెలంగాణ మంత్రులు ఒక్కొక్కరుగా మండిపడ్డ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వెంటనే ఈ మాటలను వెనక్కి తీసుకొని మా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి మంత్రులు డిమాండ్ చేశారు. అయితే తాజాగా పవన్ దిష్టి అని సంబోధించిన వ్యాఖ్యలపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు తెలంగాణలో అగ్గిరాచుకున్న వేల మంత్రి కందుల దుర్గేష్ అసలు విషయాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పట్ల పవన్ కళ్యాణ్ కు అమితమైన అభిమానం అలాగే ప్రేమ ఉన్నాయి అని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ప్రకృతి విపత్తు సంభవించిన కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ సహకారం అందిస్తూ వస్తున్నారు అని తెలియజేశారు. ఇక దిష్టి వ్యాఖ్యలు కూడా ఒక సామెతగా అన్నమాటే కానీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా కించపరచాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అ వ్యాఖ్యలు చేయలేదు అని వివరణ ఇచ్చారు. జనసేన పార్టీ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఈయన రాష్ట్రాల మధ్య సంబంధాలను తెంచేటువంటి వ్యక్తి కాదు అని తెలిపారు. కాబట్టి ఈ వివాదాన్ని ఇంతటితో ఆపివేయాలని కోరుకుంటున్నామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.
Read also : మా ఇద్దరి మధ్య స్నేహం శాశ్వతంగా ఉండిపోతుంది : ప్రధాని మోదీ
Read also : పిల్లలు ఫోన్లు పక్కనపెట్టి పుస్తకాలు చదవాలి : డిప్యూటీ సీఎం




