
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఈ ఏడాది చాలామంది క్రికెట్ అభిమానులకు ఒక బాధాకరమైన విషయమని చెప్పాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏజ్ అయిపోయి కొంతమంది.. చిన్న వయసులోనే మరి కొంతమంది, మరి కొంతమంది వివిధ కారణాలతో క్రికెట్ కు వీడ్కోలు పలికారు. కానీ ఈ ఏడాది మాత్రం చాలా మంది స్టార్ క్రికెటర్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. బహుశా ఇందుకేనేమో.. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఏడాది ఎంతమంది దిగ్గజా ఆటగాళ్లు తమ కెరీర్ కు ముగింపు పలికారో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ పేర్లు చెప్పేముందు మనమందరం కూడా ఒక విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలామంది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
Read also : భారీ వర్షాలు.. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి : హోంమంత్రి
మొట్టమొదటగా, తాజాగా.. టీమిండియా సీనియర్ బ్యాట్స్మెన్ అయినటువంటి ఛతిస్వర్ పూజార రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఆగస్టు 24వ తేదీన అతను అన్ని ఫార్మేట్ ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. మార్టిన్ గుప్టిల్, తమీం ఇక్బాల్, వరుణ్ అరోణ్, జద్రాన్, వృద్ధిమాన్ సాహ, పీయూష్ చావ్లా, నికోలస్ పూరన్ ఇలా వీరందరూ కూడా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం జరిగింది. మరోవైపు ఈ ఏడాది టెస్ట్ క్రికెట్ కు మాత్రమే వీడ్కోలు పలికిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. టీమిండియాలో ఎన్నో రికార్డు నెలకొల్పిన.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. వీరితోపాటుగా శ్రీలంక సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాత్యుస్ చూసి కూడా టెస్ట్ క్రికెట్ వీడ్కోలు పలికారు.
ఇక 2025 సంవత్సరం కు గాను వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వారిలో ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ ప్లేయర్స్ ఉన్నారు. వారిలో మార్కర్ స్థాయినిస్, గ్లెన్ మాక్సివల్, స్టీవ్ స్మిత్, ముష్ఫికర్ రహీం, వంటి స్టార్ బ్యాట్స్మెన్లు కూడా ఉన్నారు. దీంతో ఈ ఏడాది ఇంకా కొంతమంది రిటైర్మెంట్ ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ లిస్టులో ఇంకెంతమంది స్టార్ ప్లేయర్స్ చేరుతారో అని క్రికెట్ అభిమానులు ఆందోళన చెపుతున్నారు. మా అభిమాన క్రికెటర్ లిస్టులో ఉండకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
Read also: కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా : బండి సంజయ్