
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్నటువంటి SSMB29 సినిమా టైటిల్ పేరు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి భారీ బడ్జెట్ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మన దేశం, ప్రపంచమే ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు రూపొందించారు. ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. దీంతోనే ఇప్పుడు మహేష్ బాబు తో చేయబోయేటువంటి సినిమా పై ప్రతి ఒక్కరికి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు రాజమౌళి కూడా హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని రూపొందించాలని తెగ ప్లాన్ చేస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగానే ఇప్పటివరకు రాజమౌళి ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా మహేష్ బాబు అలాగే హీరోయిన్ ప్రియాంక పాత్రలు పూర్తయ్యాయని… ఇక పోస్ట్ ప్రొడక్షన్లు, కొంత బిఎఫ్ ఎక్స్ వర్కులు మాత్రమే పూర్తి కావాల్సి ఉంది అని సమాచారం అందింది.
Read also : యాదాద్రి భువనగిరిలో దారుణం..! హోంగార్డుపైకి దూసుకెళ్లిన లారీ
అయితే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమాకు “వారణాసి” అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లుగా సినిమా ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ టైటిల్ అంతగా ఎవరికి కూడా నచ్చట్లేదు. ఎందుకంటే హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు కాబట్టి… వారణాసి అనే టైటిల్ నేమ్ చాలా సింపుల్ గా ఉండడంతో… దీనిపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై రాజమౌళి అలాగే చిత్ర బృందం కూడా ఒకసారి ఆలోచించాలి అని… హాలీవుడ్ స్టైల్ రేంజ్ లో ఈ సినిమా వెళ్లాలంటే కచ్చితంగా ఒక డిఫరెంట్ టైటిల్ నేమ్ అనేది ఉండాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఇక మరోవైపు సోషల్ మీడియా వేదికగా టైటిల్ ఏదైనా సినిమా అద్భుతంగా ఉంటుంది అని… రాజమౌళి ప్లాన్ చేస్తే దానికి వెనుకాల చాలానే కృషి ఉంటుంది అని మరి కొంతమంది ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
Read also : కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు?