
-
రోహింగ్యా అక్రమ నివాసాలు దేశానికి ప్రమాదకరం.!
-
హిందువులంతా సంఘటితంగా ముందుకు రావాలి..!
మహేశ్వరం జోన్, మే 22 క్రైమ్ మిర్రర్ : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన హిందూ ఐక్యత శక్తి యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ యాత్రను శ్రీ పంచముఖి హనుమాన్ వ్యాయామశాల కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీరాములు అనంతరం మహా హారతి ఇచ్చి కాషాయ కాషాయ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.
హనుమంతుని ఆదర్శంగా తీసుకోవాలి భక్తి, ధైర్యం, నిజాయితీ, జ్ఞానం, సేవ వంటి గుణాలు హనుమంతుడిలో ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆయన లాంటి వీరుడు హిందూ సమాజానికి ఆదర్శం. నేడు మన ధర్మం, సంస్కృతి, దేవాలయాలు దాడులకు గురవుతున్న నేపథ్యంలో ప్రతి హిందువూ ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
రోహింగ్యాలపై కఠిన వాక్యాలు చేస్తూ… అక్రమంగా నివాసం ఉండే రోహింగ్యాలు భారతదేశ భద్రతకు గణనీయమైన ప్రమాదంగా మారుతున్నాయని ఆయన అన్నారు. ఇవాళ్టి పరిస్థితుల్లో రోహింగ్యాల వల్ల హిందువులపై ముప్పు పొంచి ఉంది. శాంతియుతంగా జీవించే హిందూ కుటుంబాలకు భద్రతా విషయంలో తలెత్తే ప్రమాదాలను నిరోధించేందుకు, వీరిని దేశం నుంచి తరిమికొట్టేందుకు ప్రతి ఒక్క హిందువు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ యాత్రలో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్, వివిధ క్షేత్రాల నాయకులు, హిందూ సంఘాలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాత్రకు మార్గమధ్యలో హనుమాన్ భజనలు, నినాదాలతో హిందూ ఐక్యతను ప్రదర్శించారు.