
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- శ్రీ లీలా అనే పేరు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మారుమొగుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీ లీలకు భారీగానే అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా మరోవైపు తమిళంలో కూడా శ్రీ లీలా అడుగుపెట్టేశారు. ఇక తాజాగా శివ కార్తికేయన్ నటిస్తున్నటువంటి పరాశక్తి సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా రెట్రో శారీలో శ్రీ లీలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఆమె రెట్రో చీర కు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. పరాశక్తి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమిళనాడులో జరిగిన ఒక ఈవెంట్ కు శ్రీ లీల బ్లాక్ సారీ, జడలో గులాబీ పువ్వు పెట్టుకొని కనిపించారు.
Read also : హార్థిక్ పాండ్యా ఉగ్రరూపం… సిక్సులు, ఫోర్ లతో విధ్వంసం?
అలనాటి హీరోయిన్లను తలపించేలా శ్రీ లీలా ఉంది అంటూ ఈ ఫోటోలను చూసినటువంటి ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే మరోవైపు ఈ పరాశక్తి సినిమా రేపు విడుదల కావాల్సి ఉండగా ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో సినిమా విడుదలపై గందరగోళపు పరిస్థితులు ఏర్పడ్డాయి. మొన్న విజయ్ దళపతి జననాయగన్ సినిమా కూడా ఇదే కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇంతలో మళ్లీ ఈ సినిమా కూడా సెన్సార్ సర్టిఫికెట్ సమస్యల వల్ల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా శ్రీ లీలా అయితే వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల నటిస్తున్న విషయం తెలిసిందే.
Read also : ప్రభుత్వ పాఠశాల ముగ్గుల పోటీలో సర్పంచ్ కూతురు ప్రతిభ.





