
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 2025లో ఎస్ ఆర్ హెచ్ మొదటి మ్యాచ్ లోనే ఏకంగా 286 పరుగులు చేసింది. అయితే తాజాగా అలాంటి హైదరాబాద్ టీం ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉచిత పాసుల కోసం ఎస్ ఆర్ ఎచ్ టీంను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందని ఎస్ఆర్హెచ్ ప్రతినిధి HCA కోశాధికారికి లేఖ రాశారు. మేము అడిగిన అన్ని పాసులు ఇవ్వనందుకు ఇటీవల కార్పొరేట్ బాక్స్ కు తాళాలు వేసినట్లు పేర్కొన్నారు. ఉచిత పాసుల విషయంలో మమ్మల్ని HCA అధ్యక్షుడు జగన్మోహన్రావు పలుమార్లు బెదిరించారని.. ఇలాగే కొనసాగితే హైదరాబాదు వదిలి వెళ్ళిపోతామని హెచ్చరించడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఎస్ ఆర్ హెచ్ టీం కోరింది.
Also Read : జగన్‌ను జైలుకు పంపాలని టీడీపీ ప్లాన్! – మోడీ రియాక్షన్ ఏంటి..?
అయితే తాజాగా పాసుల కోసం ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని హెచ్సీఏ వేధింపులకు గురి చేసిన వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని వివరాలను సేకరించి దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరిగితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. కాగా ఇప్పుడిప్పుడే ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ టీం తెలుగు ప్రేక్షకులను వాళ్ల యొక్క ఆటతో మైమరిపిస్తున్నారు. ఎస్ ఆర్ హెచ్ టీం ఇప్పుడు అన్ని జట్ల కంటే చాలా బలంగా ఉంది. మరి ఇలాంటి టైం లో ఉచిత పాసుల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎస్ఆర్హెచ్ జుట్టును వేధించడమేంటని అభిమానులు ఫైర్ అవుతున్నారు.