
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- IPL 2026 లో జరిగేటువంటి మినీ యాక్షన్ కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ జట్టులో కొనసాగుతున్నటువంటి స్టార్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసన్ ను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. కాగా ఈ విధ్వంసకర ప్లేయర్ ను గత ఐపీఎల్ మెగా యాక్షన్ లో 23 కోట్లను ఖర్చు చేసి ఆరంజ్ ఆర్మీ కొనుగోలు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే అతడిని రిలీజ్ చేస్తే 23 కోట్లు డబ్బు వెనక్కి వస్తుంది కాబట్టి ఆ డబ్బుతో మంచి బౌలర్ ను అలాగే మంచి ఆల్రౌండర్ ను రీప్లేస్ చేసి జట్టును బలంగా చేసుకోవచ్చు అని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్లు ఉండగా .. మహమ్మద్ షమ్మీ తప్ప జట్టులో స్టార్ బౌలర్స్ లేకపోవడంతో గత సీజన్ లో కూడా మొదట్లో బాగా రానిచ్చిన మిగతా బౌలింగ్ అంతగా లేకపోవడంతో చివరికి సెమీఫైనల్స్ కు కూడా రాలేకపోయింది. దీంతో ఈసారైనా బలమైన జట్టుతో ట్రోఫీ నెగ్గాలని ఏర్పాటు చేసుకుంటుంది.
Read also : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు కూడా ఏపీలో దంచి కొట్టనున్న వర్షాలు..
Read also : హిట్లు లేకపోయినా.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న శ్రీ లీల!





