సినిమా

బాలీవుడ్ కన్నా దక్షిణాది నటులే బెటర్.. ఎందులోనంటే : ప్రముఖ విలన్

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- మన టాలీవుడ్ లో ఉత్తరాది నుంచి వచ్చి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తులలో ముందుంటారు ఈ నటుడు షాయాజీ షిండే. ఈ నటుడు మన దక్షిణాది రాష్ట్ర హీరోలతో ఎన్నో సినిమాలలో విలన్ గా నటించి ప్రతి ఒక్కరిని కూడా మెప్పించారు. నిజం చెప్పాలంటే ఉత్తరాది కన్నా దక్షిణాదిలోనే ఈ నటుడికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో అయితే ఏకంగా చాలానే సినిమాల్లో నటించారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ దర్శకులు అలాగే ప్రముఖ హీరోలతో ఇతనికి చాలానే మంచి సంబంధాలు ఉన్నాయి. ఇతని కెరీర్ బాలీవుడ్ లో కంటే, టాలీవుడ్ అలాగే కోలీవుడ్ లోనే చాలా గొప్పగా వెలిగిపోయింది. అయితే షాయాజీ షిండే దక్షిణాది రాష్ట్ర హీరోల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓపెన్ గా చెప్పాలి అంటే బాలీవుడ్ నటులతో పోలిస్తే దక్షిణాది నటులు మర్యాదలు చేయడంలో ముందుంటారని… మిగతా విషయాలు పక్కన పెడితే దక్షిణాదినటులు చాలా మర్యాదస్తులని ఆయన వ్యాఖ్యానించారు.

Read also : ఏపీ 2029 లో ఈ పార్టీదే అధికారం?.. గత రికార్డులే సాక్ష్యం!

దక్షిణాదిన ఉన్నటువంటి వారు చాలా వినయం, చాలా గౌరవప్రదమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. కాబట్టి వారు ఉండే విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నారని , అది అంత సులభం కాదని ఈ నటుడు చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఒక చిత్రం చేస్తున్నప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా… అది చూసిన రజనీకాంత్ బయట ఎందుకు కూర్చున్నావు.. అని చాలా మర్యాదగా అడిగారు. అలాగే తన ఆహారాన్ని నాతో షేర్ చేసుకున్నారు. మహారాష్ట్రలోని ఒక మారుమూల ప్రాంతంలో వ్యవసాయ కుటుంబంలో.. జన్మించిన నేను ఎలాగోలా మంచి స్థాయికి వచ్చాను. ఇంతటి మర్యాద నేను మా చోట కన్నా మీ చోటనే చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు అన్ని భాషలలో కలిపి ఎన్నో సినిమాలలో ఈ విలన్ షాయాజీ షిండే నటించారు.

Read also : ప్రధాన న్యాయమూర్తి పై దాడి… తెలంగాణ సీఎం ఆసక్తికర ట్వీట్ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button