
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య నిన్న రాత్రి 7 గంటలకు కటక్ లో మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. మొదట టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో మొదట బ్యాటింగ్ దిగిన భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలగా చివరిలో హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కేవలం హార్దిక్ పాండ్యా చివరిలో విరుచుకపడడంతోనే టీమ్ ఇండియా 175 భారీ పరుగులు చేయగలిగింది. అనంతరం చేధనకు దిగిన సౌత్ ఆఫ్రికా 74 పరుగులకే ఆల్ అవుట్ అవ్వడంతో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ తరఫున అత్యధికంగా హార్దిక్ పాండ్యా 59 పరుగులు చేశాడు. ఇక సౌత్ ఆఫ్రికా తరఫున బ్రెవిస్ మాత్రమే 22 పరుగులు అత్యధికంగా చేయగలిగాడు. ఇక మిగతా ప్లేయర్ లందరూ కూడా 20 పరుగులు లోపు మాత్రమే అవుట్ అయ్యారు. దీంతో ఏకంగా ఆరుసార్లు 100 పరుగుల లోపు ఆల్ అవుట్ అయిన జట్టుగా సౌత్ ఆఫ్రికా చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇందులో మూడుసార్లు భారత జట్టుతోనే వందలోపు పరుగులకు అలౌట్ అయింది. దీంతో సౌత్ ఆఫ్రికా అభిమానులు ఆ జట్టు పై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మిగతా నాలుగు టి20 లలో గెలిచి సత్తా చాటాలని సౌత్ ఆఫ్రికా ఆలోచనలో ఉంది.
Read also : రేపే ప్రీమియర్స్.. ఎల్లుండి విడుదల.. 14 రీల్స్ ప్లస్ కీలక ప్రకటన!
Read also : జగన్ గెలిచినప్పుడు ప్రజలు గెలిపించారట.. మేం గెలిచినప్పుడేమో చోరీ అట : టీడీపీ ఎంపీ





