
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- ఆస్ట్రేలియా దేశంలో ఈరోజు నుంచి సోషల్ మీడియా బంద్ కానుంది. దేశవ్యాప్తంగా ఎవరైతే పదహారేళ్ల లోపు పిల్లలు ఉంటారో వారందరూ కూడా ఈరోజు నుంచి సోషల్ మీడియాను వినియోగించలేరు. ఇప్పటికే సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ యాప్స్ అయినటువంటి ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, టిక్ టాక్, స్నాప్ చాట్ మరియు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా యాప్స్ అన్ని కూడా పదహారేళ్ల లోపు పిల్లలకు బంద్ కానున్నాయి. అయితే ఆస్ట్రేలియా లాంటి ప్రముఖ దేశం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల బలమైన కారణమే ఉంది అని ప్రచారం జరుగుతుంది.
Read also : హనుమంత్ శర్మకు.. అశ్రునివాళి
ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక 14 ఏళ్ల బాలుడు ఆల్ యువర్ ఆత్మహత్య ప్రధాన కారణం అని వార్తలు వస్తున్నాయి. ‘అనోరెక్సియా నిర్వోసా’ అనే డిసీజ్ తో అలివర్ అనే 14 ఏళ్ల బాలుడు సోషల్ మీడియా ప్రభావంతో బరువు తగ్గిపోయి భయంతో ఆత్మహత్య చేసుకున్నాడట. దీంతో సోషల్ మీడియా ప్రభావం అనేది పిల్లలపై ఏ విధంగానైనా పడవచ్చు అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అలివర్ తల్లి ఆ దేశ ప్రధాని కీ లేఖ రాస్తూ ఆ లేఖలో సోషల్ మీడియా ప్రభావం పిల్లల పై పడుతుంది అని.. వెంటనే వీటికి ఒక చట్టం తీసుకురావాలని కోరడంతోనే నేడు పదహారేళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను వినియోగించుకో లేకుండా నిషేధం విధించారు.
Read also : పాకిస్తాన్ అమ్మాయిల గుండెల్లో అభిషేక్ శర్మ.. గూగుల్లో తెగ వెతికేస్తున్నారంట?





