
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాకు బాగా అలవాటు పడిపోయారు. ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాల్లోనే సోషల్ మీడియాలో న్యూస్ అందుతుండడంతో ప్రతి ఒక్కరు కూడా వాటిపైనే శ్రద్ధ చూపుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలు కూడా సోషల్ మీడియాలో వచ్చేటువంటి రీల్స్ కు బాగా ఎడిక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా దేశం 16 ఏళ్ల లోపు పిల్లలకు రేపటి నుంచి సోషల్ మీడియా పై నిషేధం అమల్లోకి వస్తుంది అని కీలక ప్రకటన చేసింది. కాగా రెండు మూడు నెలల క్రితం మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా పదహారేళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధం చేస్తామని ఆస్ట్రేలియా అధికారులు ప్రకటించారు. అన్నట్టుగానే రేపటి నుంచి ఆస్ట్రేలియా దేశవ్యాప్తంగా పదహారేళ్ల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వారందరు రేపటి నుంచి ఈ సోషల్ మీడియాను ఉపయోగించకూడదు అని తెలిపారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్ టాక్, X, యూట్యూబ్ మరియు స్నాప్ చాట్ వంటి యాప్లను అసలు ఉపయోగించకండి అని హెచ్చరించారు. కాబట్టి ఈ నిషేదానికి ముందే అంటే ఈరోజు నుంచే తమ ఫోటోలు అలాగే కాంటాక్ట్ ప్రతి ఒక్కటి కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అని తెలిపారు. నిబంధనలను పాటించని సంస్థలకు భారీ జరిమానాలు కూడా విధించనున్నారు అని ప్రకటించారు. ఇక ఈ నిర్ణయం పిల్లల మానసిక పరిస్థితి అలాగే ఆన్లైన్ లో మోసాలకు గురికాకుండా ఉండడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకుందామని ప్రభుత్వం అల్లరించింది.
Read also : BREAKING: తగ్గిన బంగారం ధరలు.. వెండి ధర మాత్రం పైపైకి
Read also : నేడే మొదటి టీ20.. ఎవరి బలమెంత?





