
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :-
ప్రస్తుత కాలంలో రెండు సంవత్సరాలనుంచే పిల్లలు మొబైల్ ఫోన్లోను అధికంగా ఉపయోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు అన్నం తినకపోతే వారి తల్లిదండ్రులే దగ్గరుండి మరీ సెల్ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. ఈ తరుణంలోనే టీనేజర్లు ఎక్కువగా మొబైల్ ఫోన్ కు అలవాటు పడడమే కాకుండా… సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ విపరీతంగా సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నారు. దీంతో ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎవరైతే 16 ఏళ్లలో పిల్లలు ఉంటారో వారందరికీ కూడా సోషల్ మీడియా వినియోగం పై నిషేధం విధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ ప్రకటించారు. పిల్లల భవిష్యత్తు సేఫ్టీ కోసమే ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్-2024 లోని ఈ కొత్త రూల్ వచ్చే డిసెంబర్ నెల 10వ తేదీన అమల్లోకి వస్తుంది అని తెలిపారు. ఈ కొత్త రూల్ ద్వారా ఆస్ట్రేలియా దేశంలో ఎవరైతే పదహారేళ్ల లోపు టీనేజర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా ఫేస్బుక్, ఇన్స్టా, టిక్ టాక్, X, యూట్యూబ్ వంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లలో ఎకౌంట్లు ఓపెన్ చేయడం అలాగే ఉపయోగించడం వంటివి చట్ట విరుద్ధంగా పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా నడుచుకోకుండా వారి తల్లిదండ్రులే పిల్లలకు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
Read also : ఒక్కసారిగా మారిన వాతావరణం.. ప్రతి ఇంటిలోనూ జలుబు, తుమ్ముల శబ్దాలే?
Read also : “జయ జయహే తెలంగాణ” సృష్టికర్త మరణం.. నివాళులర్పించిన ప్రముఖ వ్యక్తులు!





