
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఇంగ్లాండ్ మరియు భారత్ మధ్య కీలక మ్యాచ్ జరగగా అనుకోకుండా భారత జట్టు ఓటమిపాలైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం అద్భుతంగా రాణించిన స్మృతి మందాన కంటతడి పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చేజింగ్ దిగిన భారత జట్టు స్టార్టింగ్ లోనే రెండు వికెట్లకు వెళ్లిపోయి కష్టాల్లో ఉన్నటువంటి జట్టును హర్మన్ ప్రీత్ కౌర్ అలాగే స్మృతి మందన ఇద్దరు కలిసి కంఫర్టబుల్ పొజిషన్ కు తీసుకువెళ్లారు. అయినా కూడా భారత జట్టుకు ఓటమి తప్పకపోవడంతో స్మృతి మందాన బాగా ఎమోషనల్ అయ్యారు. ఆమె ఫోటోలు చూస్తున్న చాలామంది సోషల్ మీడియా వేదికగా మళ్లీ పోస్ట్ చేస్తూ సపోర్ట్ గా నిలబడ్డారు. త్వరగా ఆ బాధలో నుంచి బయటకు రా.. మేమందరం మీకు అండగా ఉన్నామంటూ ఫ్యాన్స్ స్మృతి కి సపోర్ట్ గా నిలబడ్డారు. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఉమెన్ 285 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కు దిగిన భారత్ నిర్నిత 50 ఓవర్లలో 284 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఇంగ్లాండ్ ఉమెన్ కేవలం 4 పరుగులతో విజయాన్ని నమోదు చేసుకున్నారు. మరోవైపు పురుషుల భారత జట్టు కూడా ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా మొదటి వన్డే మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో నిన్నటి రోజు ఆదివారం ఇండియాకు కలిసి రాలేదు అంటూ చాలామంది సోషల్ మీడియాలో సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Read also : ఏపీ అంబాసిడర్ల లా పని చేయాలి.. సిడ్నీలో లోకేష్ స్పీచ్ వైరల్ !
Read also : కలెక్షన్లలో రికార్డు సృష్టిస్తున్న డ్యూడ్ సినిమా..!