
క్రైమ్ మిర్రర్,పాలకీడు :- పాలకీడు మండల పోలీస్ స్టేషన్ లో క్రైమ్ మిర్రర్ తెలుగు దిన పత్రిక 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ను మండల ఎస్ఐ కోటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాలన్నారు. జర్నలిజాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజల సమస్యలపై నిత్యం స్పందిస్తూ.. అవినీతి, అక్రమాలను నిర్భయంగా వెలికితీస్తూ క్రైమ్ మిర్రర్ దిన పత్రిక పాఠకుల మన్ననలు పొందుతోందని అన్నారు.
నేటి పోటీ పత్రికా రంగంలో క్రైమ్ మిర్రర్ పత్రిక ప్రజల మన్ననలను పొందుతూ నిష్పక్షపాత వార్తలతో ముందుకు సాగుతుందన్నారు. అభివృద్ధి, ప్రజాసమస్యలపై స్పందిస్తూ సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకుని క్రైమ్ మిర్రర్ పత్రిక కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు కొప్పు రామకృష్ణ గౌడ్, జానకిరామ్, శ్రీను పాల్గొన్నారు.
Read also : క్రైమ్ మిర్రర్ పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
Read also : Cardamom: భోజనం తర్వాత వీటిని తింటే బోలెడు ప్రయోజనాలు





