తెలంగాణ

సింగారం గ్రామంలో క్రీడా పోటీలను ప్రారంభించిన ఎస్ఐ ఇరుగు రవి

మునుగోడు,క్రైమ్ మిర్రర్:- మునుగోడు మండలంలోని సింగారం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు జరుగనున్న వాలీబాల్, క్రికెట్ , ముగ్గుల పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. గ్రామానికి చెందిన పలువురు దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను ముఖ్య అతిథిగా మునుగోడు ఎస్ఐ ఇరుగు రవి పాల్గొని ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామ పెద్దలతో కలిసి వాలీబాల్ పోటీలను ప్రారంభించి యువతనుద్దేశించి మాట్లాడారు. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. యువత చెడు మార్గం వైవు వెళ్లకుండా సన్మార్గంలో పయనిస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఎస్ ఐ పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరచాలని సూచించారు.

తిమ్మాపురం గ్రామంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్య అధికారిణి

ఈ సందర్భంగా నూతన పాలకవర్గం తో పాటు గ్రామ పెద్దలు ఎస్ఐ ని సన్మానించారు. అనంతరం ఎస్ ఐ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ముగ్గుల పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అబీబొద్దీన్ గ్రామ పోలీస్ ఆఫీసర్ విలేజ్ పోలీస్ ఆఫీసర్ బి గౌతం, ఇతర పోలీస్ సిబ్బంది, చండూర్ మార్కెట్ డెరైక్టర్ కుంభం చెన్నారెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ ఉప్పునూతల వేంకటేశ్వర్లు, కుంభం సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు పిట్టల శ్రావణ్ కుమార్, గుర్రాల సురేష్, తో పాటు కోడి అర్జున్,కోడి చంద్రయ్య, క్రీడల నిర్వహణ ఆర్డినేటర్ సోమగాని నవీన్, నేరటి బాలు, గ్రామ పెద్దలు, కుంభం భూపాల్ రెడ్డి ,సోమగాని రమేష్, పోగుల ప్రకాష్, పిట్టల రఘు, గుంటుక వెంకటేష్, ఇండ్ల నాగరాజు, రావుల నరసింహ, పిట్టల వెంకట్, కోడి చంటి, రావుల మల్లేష్, ఆవనూరి శంకర్ ప్రసాద్, యువకులు తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతికి ముందు ఈ ఆలయంలో ఆడవారికి నో ఎంట్రీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button