అంతర్జాతీయం

ఐఎస్ఎస్ లోకి శుభాన్షు, తొలి భారతీయుడిగా రికార్డు!

Axiom 4 Mission: భారత హ్యోమగామి శుభాన్షు శుక్లా అరుదైన గుర్తింపు సాధించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి  అడుగు పెట్టిన తొలి ఇండియన్ గా రికార్డు కెక్కారు. శుభాన్షు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు నిన్న(జూన్ 26) సాయంత్రం ఐఎస్‌ఎస్‌ లోకి ప్రవేశించారు. అప్పటికే ఐఎస్‌ఎస్‌ లో ఉన్న ఏడుగురు వ్యోమగాములు వారికి వెల్ కం చెప్పారు. అంతరిక్షం నుంచి భూమిని చూసే అరుదైన అవకాశం లభించటంపై శుభాన్షు సంతోషం వ్యక్తం చేశారు. తాను ఊహించుకున్న దానికంటే అద్భుతంగా ఉందన్నారు.

28 గంటల తర్వాత ఐఎస్‌ఎస్‌ లోకి..

బుధవారం(జూన్ 25న) మధ్యాహ్నం 12.01 గంటలకు అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా బయల్దేరిన గ్రేస్‌.. 28 గంటల తర్వాత అంటే.. నిన్న(జూన్ 26) సాయంత్రం 4.01 గంటలకు ఐఎస్‌ఎస్‌ కు చేరుకుంది. డాకింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి సుమారు 2 గంటల సమయం పట్టింది. ఆ తర్వాత శుభాన్షు సహా మిగతా ముగ్గురు హ్యోమగాములు ఐఎస్‌ఎస్‌ లో అడుగు పెట్టారు. అంరిక్ష కేంద్రంలోకి అడుగు పెట్టిన తొలి భారతీయుడిగా శుభాన్షు గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత శుభాన్షుకు మిషన్‌ కమాండర్‌ పెగ్గీ విట్సన్‌ 634వ బాడ్జి అందజేశారు. అంటే, అంతరిక్షంలోకి అడుగు పెట్టిన 634వ వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

శుభాన్షు ఏం చెప్పారంటే?

ఐఎస్‌ఎస్‌ లోకి వెళ్లిన తర్వాత శుభాన్షు మాట్లాడారు. భారతీయ అంతరిక్ష పరిశోధనల్లో ఇదో కొత్త అధ్యాయం అన్నారు. మీ అందరి ప్రేమను తీసుకొని అంతరిక్షకేంద్రానికి వచ్చినట్లు తెలిపారు. రాబోయే 14 రోజులు శాస్త్ర పరిశోధనలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలిపారు. అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ చేపట్టిన ఈ ప్రయోగానికి శుభాన్షు మిషన్ పైలెట్ గా వ్యవహరిస్తున్నాడు. సీనియర్ హ్యోమగామి పెగ్గీ విట్సన్ మిషన్ కమాండర్ గా ఉన్నారు. ఇప్పటికే ఐఎస్‌ఎస్‌ లో ఏడుగురు వ్యోమగాములు ఉండగా, ఇప్పుడు మరో నలుగురు జత కలిశారు. ఐఎస్‌ఎస్‌ లో శుభాన్షు టీమ్ 14 రోజులు ఉంటుంది. ఈ సందర్భంగా పలు కీలక ప్రయోగాలను చేయనుంది.

Read Also: అంతరిక్షంలో శుభాన్షు.. ఫస్ట్ సందేశం ఇదే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button