
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- మంత్రి నారా లోకేష్ నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రంగా మండిపడ్డారు. కేవలం మండిపడడమే కాకుండా జగన్కు వార్నింగ్ కూడా ఇచ్చారు. రెండు రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు తీసుకునే వారిని రెండు నెలల్లోనే జైల్లో వేస్తాము అని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ జగన్ కే వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్ లో ఇంకా చాలా పేజీలు ఉన్నాయి.. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు అని లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read also : గిల్ బ్యాడ్ లక్, ఇషాన్ కిషన్ కు అదృష్టం.. T20 వరల్డ్ కప్ జట్టు ఇదే?
ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆసక్తికరంగా ఈ విషయంపై చర్చిస్తున్నారు. ఒకవైపు వైసీపీ కార్యకర్తలు మరోవైపు కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ విషయంపైనే ప్రస్తుతం చర్చిస్తున్నారు. నారా లోకేష్ చెప్పినట్లుగా త్వరలో ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో?.. ఏ నాయకుడిని త్వరలో జైలుకు పంపిస్తారు అని ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠంగా చర్చిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అధికార మరియు ప్రతిపక్షం పార్టీల మధ్య పెద్ద ఎటువంటి వైరాలు సృష్టిస్తుందో?.. మళ్లీ ఎటువంటి మాటలు యుద్ధాలు జరుగుతాయా అనేది వేచి చూడాల్సిందే. జగన్ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ వార్నింగ్ ఇవ్వడంతో ఇది ఎక్కడికి దారి తీస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇరు పార్టీల మధ్య గొడవలు వల్ల సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతాయని సామాన్య ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు.
Read also : ఐపీఎల్ కు బంగ్లాదేశ్ ప్లేయర్లు అవసరం లేదు.. ఫ్యాన్స్ రచ్చ!





