
క్రైమ్ మిర్రర్ , సినిమా న్యూస్ :- ఈసారి దీపావళి పండుగకు థియేటర్లు షేక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈసారి దీపావళికి ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో తెలుగు సినిమాలు మూడు మరొకటి తమిళ సినిమా. ఈసారి దీపావళికి ఎటువంటి పాన్ ఇండియా చిత్రం లేదు. కాబట్టి నలుగురు మామూలు హీరోలు ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నారు. ఇక ఈసారి దీపావళికి బరిలో దిగబోతున్న హీరోలు సిద్దు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం , ప్రదీప్ రంగనాథన్, ప్రియదర్శి. ఈ నలుగురు హీరోలుగా నటించినటువంటి సినిమాలు ఈ దీపావళి కానుకగా రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇక ఈ నెల 16వ తేదీన ప్రియదర్శి మరియు నిహారిక కలిసి నటించినటువంటి ” మిత్ర మండలి “. మరోవైపు సిద్దు జొన్నలగడ్డ హీరోగా.. రాశి కన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా వస్తున్నటువంటి “తెలుసు కదా” సినిమా ఈ నెల 17వ తేదీన రిలీజ్ అవ్వబోతుంది. ఇక ఇదే రోజున తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ “డ్యూడ్” అనే సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారు. ఇక యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈసారి సరికొత్త కథతో “K-RAMP” అనే సినిమాతో ఈ నెల 18వ తేదీన బరిలోకి దిగనున్నారు. దీంతో ఈసారి దీపావళి పండుగకు యువ హీరోల హవా నడవనుంది. ఇప్పటికే ఈ నాలుగు సినిమాల నుంచి వచ్చినటువంటి టీజర్స్, సాంగ్స్ అలాగే ట్రైలర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. దీంతో ప్రేక్షకులు ఏ సినిమాకి వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మరి ఈసారి ఈ నలుగురు యువ హీరోలలో ఎవరు ఎక్కువ కలెక్షన్లు రాబట్టి మంచి హిట్ ను అందుకుంటారో వేచి చూడాల్సిందే. మరి ఇందులో మీరు ఏ సినిమాకి వెళ్తున్నారో కింద కామెంట్.
Read also : పాత సెల్ ఫోన్లుకు స్టీల్ సామాన్లు ఇస్తామమ్మా… తెలంగాణలో సరికొత్త మోసగాళ్లు?
Read also : యూధులకే ఎక్కువ నోబెల్ అవార్డులు.. కారణం ఏంటి?