
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హైకోర్టు ఉపయోగించేటువంటి అధికారిక వెబ్సైట్ అనూహ్యంగా హ్యాక్ అవడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఎవరు ఊహించినటువంటి విధంగా శనివారం తెల్లవారుజామున హైకోర్టుకు సంబంధించిన అధికారిక వెబ్సైటు హ్యాక్ కు గురైందని అధికారులు గుర్తించారు. హైకోర్టుకు సంబంధించిన వివరాలు కాకుండా వాటి బదులుగా బెట్టింగ్ కు సంబంధించి వివరాలు ప్రత్యక్షమవడంతో అధికారులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. హైకోర్టుకు సంబంధించిన అధికారులు ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తున్న క్రమంలో వారికి ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు ఓపెన్ అవుతున్నట్లుగా కనిపించడంతో వెంటనే పోలీసులకు కాల్ చేసి చెప్పారు. ఈ విషయంపై వెంటనే పోలీస్ అధికారులు సైతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. అయితే ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. విచారణ తర్వాతే మరిన్ని వివరాలు మీడియాకు చెప్పగలము అని పోలీసులు తెలిపారు. కాగా ఈ మధ్య సైబర్ నేరగాళ్లు బ్యాంకులను, ప్రజలను మోసం చేస్తున్న సందర్భాలలో… ఇప్పుడు నేరుగా హైకోర్టు అధికారిక వెబ్ సైట్ ని హ్యాక్ చేస్తున్నారంటే వారు ఎంత అప్డేటెడ్ గా ఉన్నారో తెలుస్తుంది.
Read also : డ్రగ్స్ పార్టీలో బాలీవుడ్ తారలు..?
Read also : ఐపీఎల్ లో ఏం జరుగుతోంది.. పెద్ద ఎత్తున ప్లేయర్ల మార్పులు!





