
పాఠశాలలో పరిశుభ్రత కరువు, టాయిలెట్స్ లేక ఇబ్బందులు.
మధ్యాహ్న భోజన బియ్యం పక్కదారి.. గతంలో కూడా ఇదే తంతు..!?
లెక్కలేని నలభై లక్షలు..సిపీఎస్ ఇంట్రెస్ట్ నాలుగు లక్షలకు పంగ నామాలు.?!
కంప్యూటర్ ఆపరేటర్ కి కంప్యూటరే అమ్మిన మేధావి.!?
పాత సమాన్ లు అమ్మకానికి ప్లాన్.. విలేకరుల అటాక్ తో వెనకడుగు..!?
ఇప్పటికి ఇవ్వని 90 వేల స్కావెంజర్ వేతనాలు.
పని చెయ్యని ఒకేషనల్ ట్రైనర్ అన్వేష్ కి రెగ్యులర్ వేతనాలు!?
అమ్మ ఆదర్శ పాఠశాలతో పదకొండు లక్షలకు బోడిగుండు.. ఎక్కడా కూడా కనిపించని అభివృద్ధి పనులు..!?
ప్రశ్నించిన విలేకరులపై బెదిరింపులా.. ఉన్నత స్థాయి అండ ఉందని కొసెక్కిరి కూతలా..!?
ప్రిన్సిపాల్ స్టడీ సర్టిఫికెట్ లపై అనేక అనుమానాలు.. మరలా పరిశీలించాలని వినతి..!?
మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:-అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది మర్రిగూడ మోడల్ స్కూల్ వాలకం. ప్రభుత్వం నుండి అభివృద్ధి నిధులు ఎన్ని వచ్చినా, కోతుల మలాలతో నిండిన నీరే కనపడుతుంది తప్ప, అభివృద్ధి పనులు జరగలేదని తెలుస్తుంది. టాయిలెట్స్ కోసం చిన్నారులు అవస్థలు పడుతున్న తీరు, పాఠశాలలో ఇబ్బంది మారింది. పాఠశాల అభివృద్ధికి కరువై, అవినీతికి లోనవుతుందని అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మర్రిగూడ మాజీ ఎంపీపీ, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అనంతరాజు గౌడ్, డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖ, రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్ష తెలంగాణ ఇ. నవీన్ నికోలస్ ఐపీఎస్ కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పలు అంశాల గురించి, జరిగిన అవినీతి అక్రమాల గురించి పేర్కొన్నారు. మర్రిగూడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శివస్వరూపారాణి చేసిన అవినీతి చిట్టాను, రాజు గౌడ్ అధికారికి సమర్పించారు. ఈ ఈ సందర్భంగా అనంతరాజు గౌడ్ మాట్లాడుతూ, మోడల్ స్కూల్ నందు పరిశుభ్రత పరువైందని, టాయిలెట్స్ సుచి శుభ్రత లేకుండా పోయిందన్నారు. మధ్యాహ్నం పిల్లలకు పెట్టే సన్నబియ్యం పక్కదారి పడుతుందని, గతంలో ప్రిన్సిపాల్ పై ఇదే తంతు ఆరోపణలు వచ్చి, ఉన్నత అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు. శివ స్వరూపారాణి ప్రిన్సిపల్ గా రాకముందు, స్కూల్ ఖాతాలో 40 లక్షల రూపాయలు ఉన్నాయని, వాటిని లెక్కా పత్రాలు లేకుండా భస్మం చేసిందన్నారు. నాలుగు లక్షల సిపిఎస్ ఇంట్రెస్ట్ డబ్బులకు పంగనామాలు పెట్టిందన్నారు. స్కూల్ నందు పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సురేష్ కే, ప్రభుత్వం ఇచ్చిన కంప్యూటర్ ని అమ్మిన మేధావి అన్నారు. స్కూల్ నందు పాత సామాన్లు, తదితర వస్తువులను ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టడంతో, స్థానిక విలేకరులు ఆ దారుణానికి అడ్డుగా నిలవడంతో, ప్రభుత్వ వస్తువులను పక్కదారి పట్టకుండా ఆపగలిగారన్నారు. 90 వేల రూపాయలు స్కావెంజర్ వేతనాలు, ఖాతాలో జమ అయినప్పటికీ వారికి వేతనాలు ఇవ్వకుండా, ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. ఒకేషనల్ ట్రైనర్ గా పనులు చెయ్యని అన్వేష్ అనే ఓ వ్యక్తికి, జీతాల పేరుతో ప్రభుత్వ సొమ్మును లూటీ చేసిందని ఆరోపించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో పదకొండు లక్షలకు బోడి గుండు కొట్టిందని, ఇప్పటివరకు అటువంటి అభివృద్ధి పనులు ఏవి కూడా జరగలేదని చెప్పుకొచ్చారు. ప్రశ్నించిన విలేకరులపై బెదిరింపులకు పాల్పడుతూ, తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రచ్చకెక్కుతానని అనడం పరిపాటిగా మారిందన్నారు. నన్నేమీ చేయలేరు, ఉన్నత స్థాయి అండ నాకు కొండంత ఉందని, కొసెక్కిరి మాటలతో, అవినీతి అక్రమాలు చేస్తుందన్నారు. ప్రిన్సిపల్ శివస్వరూపారాణి చదువుపై అనేక అనుమానాలు ఉన్నాయని, ఆమె సర్టిఫికెట్లను సంబంధిత అధికారులు వెరిఫై చేయాలన్నారు. వెంటనే సంబంధిత అంశాలపై, పూర్తి విచారణ చేసి తగు చర్యలు తీసుకొని ప్రభుత్వ సొమ్మును, రికవరీ చేయాలని ఫిర్యాదులో పొందుపరిచారు. ఈ అంశాలపై స్పందించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన, అనంతరాజు గౌడును మండల ప్రజలు అభినందించారు.
పూర్తి సమాచారంతో మరో క్రైమ్ మిర్రర్ కధనం ద్వారా మీ ముందుకు….