క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం అద్దె భవనాల్లో కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సొంత భవనాల్లోకి మార్చాలని తెలంగాణ రాష్ట్రా ప్రభుత్వ కీలక ఆదేశాలు జారీ చేసింది.
అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు మరియు యూనివర్సిటీలు 2025 డిసెంబర్ 31 లోపు ప్రభుత్వ యాజమాన్యంలోని భవనాల్లోకి మారాలని ఆర్థిక శాఖ “టాప్ ప్రయారిటీ” సర్క్యులర్ జారీ చేసింది.
2026 జనవరి 1 నుండి ప్రైవేట్ భవనాల్లో ఏ ప్రభుత్వ కార్యాలయం ఉండకూడదు. ఫిబ్రవరి 1, 2026 నుండి ప్రైవేట్ భవనాలకు ఎలాంటి అద్దె చెల్లింపులు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వ భవనాల్లో తగినంత స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ, అద్దె రూపంలో ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని అంతర్గత ఆడిట్‌లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గడువు తర్వాత కూడా ప్రైవేట్ భవనాలకు అద్దె చెల్లించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.





