
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై జగన్ చెల్లెలు షర్మిల మాత్రం తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. ఒకపక్క మోదీ జగన్ కంటే బెటర్ అంటూ… జగన్ అలాగే మోడీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోడీ… ఏపీ అభివృద్ధికి ఎప్పుడూ కూడా అండగా నిలబడతానని చెప్పిన నరేంద్ర మోడీ… అమరావతికి మాత్రం ఎటువంటి నిధులు కేటాయించలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ తీరు చిచ్చుబుడ్డి తుస్సు మన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రం దేనని తేల్చి చెప్పింది.
ఇక మరోవైపు కూటమి ప్రభుత్వ విషయంలో చాలా చాకచక్యంగా సానుకూలంగానే స్పందించారు. నిజం చెప్పాలంటే 2024 ఎన్నికలలో షర్మిల టిడిపికి సానుకూలతంగా… టిడిపి గెలవడంలో షర్మిల పాత్ర కూడా ఎంతో కొంత ఉందని చెప్పాలి. తన సొంత అన్న జగన్ మోహన్ రెడ్డిని తన మాటలతో విమర్శించడం వల్ల కొంతమంది వైసీపీ కార్యకర్తలు కూడా టిడిపి కీబోర్డు వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం షర్మిల కూటమి ప్రభుత్వం బీజేపీతో స్నేహం చేయడం వల్ల కూటమి ప్రభుత్వం ను విమర్శించడం తప్పట్లేదు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి పునర్నిర్మాణం చేపట్టినా కూడా కూటమి ప్రభుత్వంపై అలాగే రాజధాని అమరావతిపై.. మరోవైపు మోదీపై కూడా విమర్శలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు. కానీ షర్మిల మాత్రం ఏమాత్రం భయం లేకుండా అందరి మీద విరుచుకుపడుతూనే ఉంది.
సీఎంవోలో ప్రక్షాళన- సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ ఇదే…!
పవన్ దగ్గుతున్నాడని విక్స్ చాక్లెట్ ఇచ్చిన మోడీ – అభిమానమా…! వ్యూహమా…!