క్రైమ్

శంషాబాద్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి

మరో ముగ్గురు కానిస్టేబుళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

శంషాబాద్, క్రైమ్ మిర్రర్ : శనివారం అర్ధరాత్రి శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ విజయ్ తీవ్రంగా గాయపడడంతో మృతి చెందారు. ఈ ఘటన పోలీసు శాఖలో విషాదాన్ని నింపింది.

విజయ్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం షాబాద్ మండలంలోని ఆయన స్వగ్రామంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు.

ఈ ప్రమాదంలో మరో ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ప్రస్తుతంగా వారు మాదాపూర్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతున్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button