
Reuven Azar On Priyanka Gandhi: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని ప్రియాంక విమర్శించారు. ఇప్పటికే 60 వేలాది మంది మరణానికి కారణమైందంటూ ఆరోపించారు. వారిలో 18,430 మంది చిన్నారులేనన్నారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ ఈ విధ్వంసాన్ని కొనసాగిస్తుండగా భారత ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
నిప్పులు చెరిగిన ఇజ్రాయెల్ రాయబారి
ప్రియాంక వ్యాఖ్యలపై భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలోని 25 వేల మంది హమాస్ ఉగ్రవాదులనే తాము చంపామని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ 20 లక్షల టన్నుల ఆహార పదార్థాలను గాజాకు పంపించిందన్నారు. హమాస్ అమాయకపు ప్రజల్ని నిర్బంధించడం కారణంగా వారి ఆకలికి కారణమవుతోందన్నారు. గాజాలో జాతుల మారణహోమం లేదని, గడిచిన 50 ఏళ్లలో అక్కడి జనాభా 450 శాతం పెరగడమే దీనికి నిదర్శనమని అజార్ వెల్లడించారు. పూర్తి విషయాలు తెలుసుకుని ప్రియాంక మాట్లాడితే బాగుంటుందని సూచించారు.
Read Also: జెలెన్ స్కీకి ప్రధాని మోడీ ఫోన్, కీలక అంశాలపై చర్చ!