
క్రైమ్ మిర్రర్, జగిత్యాల:- జగిత్యాల జిల్లా (TGSRTC) తమ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ TGSRTC జగిత్యాల డిపో అద్దె బస్సు డ్రైవర్లు ఈరోజు ఉదయం నిరసన చేపట్టారు. దీంతో డిపోలో అద్దె బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
నిలిచిన బస్సులు:- ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటల నుంచే అద్దె బస్సుల డ్రైవర్లు తమ విధులను బహిష్కరించి నిరసన ప్రారంభించారు.
ప్రయాణికుల అవస్థ:- బస్సులన్నీ డిపోకే పరిమితం కావడంతో, ఉదయం తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అరెస్టులు:- పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నిరసన తెలుపుతున్న అద్దె బస్సు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
డిమాండ్లు:- అద్దె బస్సు డ్రైవర్లు తమకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నిరసన చేపట్టినట్లుగా తెలుస్తోంది.ఈ ఆందోళన కారణంగా జగిత్యాల పరిసర ప్రాంతాల్లోని పలు రూట్లలో బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
Read also : రవితేజ – సమంత కాంబినేషన్ లో సినిమా.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!
Read also : Wonderful: రోజురోజుకూ పెరుగుతున్న శివలింగం!.. ఎక్కడో తెలుసా?





