Monday, March 23, 2026
Homeఆంధ్ర ప్రదేశ్రైల్వే బ్రిడ్జి పై ఘోర రోడ్డు ప్ర‌మాదం

రైల్వే బ్రిడ్జి పై ఘోర రోడ్డు ప్ర‌మాదం

  • ముగ్గురు మృతి
  • ఒక‌రికి తీవ్ర‌గాయాలు

రాజమండ్రి, క్రైం మిర్ర‌ర్ః తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జి పై జరిగిన‌ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘ‌ట‌న వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. వివ‌రాలు ఇలా ఉన్నాయి.

కొవ్వూరు నుండి పల్సర్ వాహనంపై ముగ్గురు యువకులు రాజమండ్రి వెళ్తూ ఎదురుగా వస్తున్న యాక్టివాహనాన్ని ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

వాహనంపై ఉన్న పోతుకుంట అక్షయ్ కుమార్ (20), సగరపు సత్య కళ్యాణ్(20) రాజమండ్రి కి చెందిన ఆవాల లక్ష్మీనారాయణ సంఘటన స్థలంలోనే మృతి చెంద‌గా గాయాలైన ఏడుకొండలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బ‌లంగా ఢీ కొట్ట‌డంతో మృత‌దేహాలు రోడ్డుపై ఎల్లా చెదురుగ ప‌డ్డాయి. కాసేపు రోడ్డుకు ఇరువైపుల వాహ‌నాలు నిలిచిపోయాయి.

విష‌యం తెలుసుకున్న ప‌ట్ట‌ణ సీఐ సంఘ‌టనా స్థ‌లానికి చేరుకొని ప్ర‌మాదానికి గ‌ల వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments