
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :-డిసెంబర్ 24వ తేదీన ప్రారంభమైన ఈ విజయ్ హజారే ట్రోఫీలో మొదటి రోజే రికార్డుల మోత మొదలైంది. ప్రారంభమైన మొదటి రోజున ఏకంగా 22 మంది ప్లేయర్లు సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. అందులో సీనియర్ ప్లేయర్స్ ఉండడం గమనార్హం. ఈ విజయ హజారే ట్రోఫీలో ఒడిశా ప్లేయర్ స్వస్తిక్ అనే ప్లేయర్ ఏకంగా డబుల్ సెంచరీని బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక బీహార్ రాష్ట్రం నుంచి ఏకంగా ముగ్గురు ప్లేయర్లు సెంచరీలు చేయడంతో బీహార్ పేరు మోత మోగిపోతుంది. బీహార్ రాష్ట్రం నుంచి 14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశి, ఆయుష్ మరియు గని అనే ముగ్గురు ప్లేయర్లు అతి తక్కువ బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేశారు. బీహార్ క్రికెటర్ గని అనే ప్లేయర్ ఏకంగా 32 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసి సరికొత్త రికార్డు నమోదు చేశాడు. మరోవైపు దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ కూడా మొదటి రోజే సెంచరీలు కొట్టారు. ఇందులో రోహిత్ శర్మ 94 బంతులకు 155 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 101 బంతుల్లో 131 పరుగులు చేశారు. ఇంకోవైపు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విజృంభించిన ఇషాన్ కిషన్ కూడా నిన్న జరిగినటువంటి విజయ హజారే ట్రోఫీలో సెంచరీ చేశారు. ప్రారంభమైన మొదటి రోజే విజయ్ హజారే ట్రోఫీలో సంచలన రికార్డులు నమోదు అయ్యాయి.
Read also : ఇంట్లో దేవుళ్ల విగ్రహాలను పెట్టుకోవచ్చా?.. అసలు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?
Read also : బీజేపీ సర్పంచులు గెలిచిన గ్రామాలకు వరాలు కురిపిస్తున్న సంజయ్





