ఆంధ్ర ప్రదేశ్

గోవా గవర్నర్‌గా టీడీపీ సీనియర్‌ నేత

  • రెండు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన కేంద్రం

  • హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్‌ ఘోష్‌

  • లడక్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కవీందర్‌ గుప్తా

  • అశోక్‌ గజతిరాజుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

క్రైమ్‌ మిర్రర్‌, ఢిల్లీ: గోవా గవర్నర్‌గా టీడీపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతి రాజు నియమితులయ్యారు. సోమవారం రోజున రెండు రాష్ట్రాలకు గవర్నర్లను, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కేంద్రం నియమించింది. గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు, హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్‌ ఘోష్‌, లడక్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కవీందర్‌ గుప్తాను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, టీడీపీకి చెందిన సీనియర్‌ నేత, ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజును గోవా గవర్నర్‌గా కేంద్రం నియమించింది. అశోక్‌ గజపతిరాజు కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రిగా పనిచేశారు. అశోక్‌ గజపతిరాజు గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. విజయనగరం రాజవంశానికి చెందినవారు అశోక్‌ గజపతిరాజు. ఆయన గోవా గవర్నర్‌గా నియమితులు కావడం పట్ల పలువురు రాజకీయ నాయకులు, టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ప్రజలకు గర్వకారణం: చంద్రబాబు

గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు నియమితులవ్వడం తెలుగు ప్రజలకు గర్వకారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అశోక్‌ గజపతిరాజును గవర్నర్‌గా నియమించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అశోక్‌ గజపతిరాజు విజయవంతంగా తన పదవీకాలాన్ని పూర్తిచేసుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అశోక్‌ గజపతిరాజుకు ఏపీ మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. గవర్నర్‌ పదవికి అశోక్‌ గజపతిరాజు వన్నె తెస్తారని ఆశిస్తున్నట్లు లోకేష్‌ తెలిపారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button