
హైదరాబాద్(క్రైమ్ మిర్రర్):-విధి నిర్వహణలో భాగంగా ఓ ప్రముఖ ఛానల్ జర్నలిస్ట్ బ్యూరో స్థాయిలో హైదరాబాద్ నుండి కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో పాల్గొంటారు. ఈ క్రమంలో పరిగి కొడంగల్ చౌరస్తా సమీపంలో గల, గంగపుత్ర స్మశాన వాటికలో తల దాచుకుంటున్న ఓ వృద్ధుడు, ఇద్దరు చిన్నారులను గమనించాడు. స్మశాన వాటికలో వారు ఎం చేస్తున్నారని పరిశీలించిన జర్నలిస్ట్ వారి దగ్గరికి వెళ్లి వివరాలు అడిగాడు. సదరు బాధితులు చెప్పిన మాటలు విని చలించి పోయిన ఆయన, వారికి సహాయం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు. వృద్ధ వయసులో ఉన్న నారాయణను, మూగ బాలుడైన ఆంజనేయులును చూసి చలించిపోయాడు. వారికి వెంటనే తన వద్ద ఉన్న మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయంగా వారికి అందిస్తాడు. అంతటితో ఆగకుండా అట్టి విషయాన్ని తెలంగాణ ముఖ్యమంతి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాడు. జర్నలిస్ట్ ద్వారా విషయం తెలుసుకున్న సిఎం స్థానిక రెవెన్యూ అధికారులను ఆరా తీసారు. వెంటనే గంగపుత్ర స్మశాన వాటిక వద్దకు వెళ్లిన రెవెన్యూ అధికారులు, అక్కడి పరిస్థితులను తెలుసుకొని, బాధితుల నుండి వివరాలు సేకరించి, వెంటనే వారికి ఉండడానికి ఇళ్లు, వృత్తి కోసం ఎలక్ట్రిక్ రిక్షా సాంక్షన్ చేశారు. ఇద్దరు చిన్నారుల విద్యకోసం ప్రత్యేక దృష్టి పెట్టి, గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు చేయించారు. మానవత్వాన్ని చాటుకున్న జర్నలిస్ట్ పై ప్రజలు ప్రశంసలు కురిపించారు. జర్నలిజంతో అక్రమాలను బహిర్గతం చెయ్యడమే కాదు, మానవత్వాన్ని చాటడంపై, సీఎం రేవంత్ రెడ్డి స్పందనపై, ఆయన చూపిన చొరవపై ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Read also : ట్రంప్ సీరియస్ కామెంట్స్.. భారత్ కూల్ రియాక్షన్!
Read also: బీహార్ ఓటర్ల ముసాయిదా లిస్ట్ వచ్చేసింది, ఈసీ ఏం చెప్పిందంటే?