
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఒక వ్యాధి ప్రతి ఒక్కరిని కూడా కలవరపెడుతుంది. ఆ వ్యాధి కూడా చిన్న పురుగు వల్ల రావడం.. అది కుట్టగానే అనేక రకాలుగా అనారోగ్య సమస్యలకు గురవడం అనేది సహజంగా జరిగిపోతుంది అని చాలా మంది కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఉత్తరాంధ్రలో స్క్రబ్ టైఫాస్ అనే వ్యాధి కేసులు ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురిచేస్తున్నాయి. చిత్తూరు, కాకినాడ మరియు విశాఖపట్నంలో 500 కు పైగా కేసులు నమోదయ్యాయి అని తాజాగా వైద్య అధికారులు వెల్లడించారు. ఈ స్క్రబ్ టైఫాస్ అనే వ్యాధి లక్షణాలతో విజయనగరంలోని ఒక మహిళ తాజాగా మరణించింది. నల్లి తరహాలో ఉండేటువంటి ఈ చిన్న పురుగు కుడితే మాత్రం ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. ఈ చిన్న పురుగు ఓరియంటియా సర్ట్స్ గముషి అనే బ్యాక్టీరియా రూపం. ఇది ఒక్కసారి కుడితే చర్మంపై దద్దుర్లు ఏర్పడడంతో పాటు వారం రోజుల తరువాత మెల్లిగా జ్వరం, వణుకు, జలుబు, దగ్గుల సమస్యలు అలాగే నీరసం వంటి అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి అని వైద్యులు తెలిపారు. అలా అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అని.. సకాలంలో వైద్యులను సంప్రదించకుంటే ప్లేట్లెట్స్ పడిపోవడం, మెదడు మరియు తీవ్ర శాస సంబంధిత సమస్యలు అలాగే వెన్నెముక ఇన్ఫెక్షన్స్ సోకుతాయి అని డాక్టర్లు తెలిపారు. కాబట్టి ఇటువంటి సమయంలో ఆ పురుగు కుట్టిందా లేదా అని తెలియకపోయినా ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి అని సూచించారు.
Read also : 9 బంతుల్లోనే 7 సిక్సర్లు.. T10 లో టిమ్ డేవిడ్ విధ్వంసం!
Read also : మనదేశంలో డిగ్రీ పట్టాలు చిత్తు కాగితాలతో సమానం : జయ ప్రకాష్ నారాయణ





