Wednesday, March 25, 2026
Homeక్రైమ్పాఠశాలలో ఉపాధ్యాయుడి కామచేష్టలు.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

పాఠశాలలో ఉపాధ్యాయుడి కామచేష్టలు.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

చింతపల్లి,క్రైమ్ మిర్రర్:- అక్షరాలు నేర్పి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన, ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. కన్న బిడ్డలా చూసుకోవాల్సిన విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి, గురుశిష్యుల బంధానికి కళంకం తెచ్చాడు. ఈ ఘటన మాల్ గోడుకొండ్ల, విటి నగర్ ప్రైమరీ స్కూల్‌లో కలకలం రేపింది. మాల్ గోడుకొండ్ల విటి నగర్ ప్రాథమిక పాఠశాలలో, 4వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల, సదరు ఉపాధ్యాయుడు గత కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. తాజాగా, సదరు ఉపాధ్యాయుడి ప్రవర్తన, హద్దులు దాటడంతో విషయం బయటకు పొక్కింది. ​బాధిత విద్యార్థిని ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. పాఠశాలకు చేరుకున్న గ్రామస్తులు సదరు ఉపాధ్యాయుడిని నిలదీశారు. అతడి సమాధానంతో సంతృప్తి చెందని జనం, అక్కడికక్కడే అతడికి దేహశుద్ధి చేశారు.​ విద్య నేర్పే దేవాలయం వంటి పాఠశాలలో, ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Read also : ఉపాధ్యాయుడి కామచేష్టలు.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు.

Read also : మహాలక్ష్మి పథకం: పురుషుల, విద్యార్థుల జేబులకు చిల్లులు..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments