ఈ మధ్య మనం ఎక్కడ చూసినా సరే మూడ నమ్మకాలు అనేవి ఇంకా నమ్ముతూనే ఉంటారు. అయితే సరిగ్గా అలానే ఒక రౌడీ షీటర్ ఎక్కువ పోలీస్ కేసులు ఉన్నాయని చెప్పి ఖాలీ గా పేరు మార్చుకొని నకిలీ బాబాగా మారాడు. అయితే ఇవన్నీ తెలియని పాతబస్తీకి చెందిన నజీయా అనే యువతి అత్తింటి వారిపై ఉన్న కోపంతో ఖాలీ నీ సంప్రదించింది.
ఇక విషయానికి వస్తే పాతబస్తీకి చెందిన నజీయా అనే యువతి తన అత్తింటి వారిపై మనస్పర్ధలు రావడంతో భారీగా కోపం పెంచుకుని ఇక ఎలా అయినా సరే వారిని చంపేయాలని అనుకుంది. అయితే ఇంతలోనే ఖాలీ అనే నకిలీ బాబాతో పరిచయం ఏర్పడగా అతనికి మాత గారిని చేతబడి చేసి ఎలాగైనా చంపాలని చెప్పి 10 వేలకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే ఈ నకిలీ బాబా కూడా మొదటిగా వారి ముగ్గురు ఫోటోలకి చేతబడి బొమ్మలు తయారుచేసి నజీయా ని నమ్మించాడు. దీంతో ఆమె ఆ చేతబడి చేస్తున్న సందర్భాన్ని మొత్తం వీడియోలో రికార్డ్ చేసింది. అయితే రెండు రోజులు తర్వాత ఆ నకిలీ బాబా నజియా బామ్మర్ది కి ఫోన్ మీ మీద చేతబడి చేస్తున్నాను రెండు రోజుల్లో చనిపోతారు అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ మాటలు విన్న నజయా బామ్మర్ది కుటుంబమంతా భయాందోళనకు గురై ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే భయపడుతూ ఉన్నారు. అయితే ఇక ధైర్యం తెచ్చుకొని భయంతోనే చేసుకొని నజీయా బామ్మర్ది వెంటనే పోలీసులను సంప్రదించాడు. దీంతో వెంటనే పోలీసులు రంగంలో దిగి విచారణ చేపట్టగా అ నకిలి బాబా విషయం బయటకు వచ్చింది.
Read More : లక్షలు తీసుకోకుండా నా భార్య ఇంటికి రాదు.. డీఈ భర్త షాకింగ్ విడియో
ఇతను పై ఇప్పటికే రౌడీ షీటర్ గా ఐదు కేసులు ఉన్నాయని పోలీసుల నుండి తప్పించుకోవడానికి నకిలీ బాబాగా మరి ఖాలీ అని పేరు పెట్టుకుని తాయత్తులు, తాళ్లు కట్టుకుంటూ అందరిని నమ్మిస్తూ డబ్బులు తీసుకునేవాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న నజియా కూడా షాక్ గురై నా దగ్గర చేతబడి చేస్తానని 10వేలు తీసుకున్నాడని బయటకు ఒప్పుకుంది. ఇక వెంటనే పోలీసులు ఆ నకిలీ బాబాను అరెస్టు చేసి ఈ కథపై పోలీసులు విచారణ చేపడుతూ కాలీ పై కేసు నమోదు చేశారు.