
సంస్థాన్ నారాయణపురం,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా,సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంని సందర్శించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు విషయాల పై డాక్టర్ సిబ్బందిని ఆరోగ్య కేంద్రంలో సమస్యలు అడిగి తెలుసుకుంది. ఎంతోమంది మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వైద్యం కోసం వస్తున్న తరుణంలో ఎలాంటి సమస్య లేకుండా చూసి నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. మంచినీటి సౌకర్యము, నీటి సరఫరా సక్రమంగా లేక పోవటం, మీటింగ్ హాల్ లేకపోవడం, ఫర్నిచర్ కొరత ఉండటం, మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉండటం వల్ల అన్ని గదులను పరిశీలించి పైన ఉన్న వాటర్ ట్యాంకులను పరిశీలన చేసి ట్యాంక్ లోకి నీళ్లను ఎక్కించి వైద్యులకు, ప్రజలకు మరుగుదొడ్ల సౌకర్యం అందుబాటులో తీసుకురావడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గారు వైద్యురాలు కు సిబ్బందికి హామీ ఇవ్వడం జరిగింది.
Read also : మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ గా ప్రేమ్ సుందర్
మండల ప్రాంతంలో వివిధ గ్రామాల నుంచి తండాల నుంచి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్యము కల్పించి తేలుకాటు, కుక్కకాటు,పాము కాటు నివారణకు ఇంజక్షన్లు అందుబాటులో ఉంచే విధంగా వైద్యులు నిరంతరం ప్రజలకు సేవలు అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు మందు గుల బాలకృష్ణ, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, కొండ నవీన్ గౌడ్, వార్డు మెంబర్ సూరపల్లి వెంకటేశం, పట్నం బాలకృష్ణ, బల్గూరి శివ, కాంగ్రెస్ నాయకులు గునిగంటి రాజు గౌడ్, క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేశం, ఎండి యూసఫ్ ఖాన్, ఈసం శివకుమార్, విడం సాయి కిషోర్,ప్రెస్ రిపోర్టర్ సింగం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read also : తెలంగాణలో చైల్డ్ ట్రాఫికింగ్ కలకలం.. 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు?





