
సంస్థాన్ నారాయణపురం, క్రైమ్మం మిర్రర్ :- సంస్థాన్ నారాయణపురం మండలం లోని 11 వ వార్డులో మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి హాజరయ్యారు. మాతృదేవోభవ అనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు గట్టుగిరి, 11వ వార్డు సభ్యులు చింతల శైలజ సత్యనారాయణ లతో కలిసి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బల్గురి శివ, నీళ్ల అనిత శంకర్, చిలువేరు రమాదేవి శంకర్, పట్నం బాలకృష్ణ, రాచకొండ రమేష్ బాబు, భూపని బలరాం, క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, బోయ శంకరయ్య, బొడ్డు పెళ్లి లోకనాథం, ఈసం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read also : 2 లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసి అందజేత
Read also : ముక్కోటి ఏకాదశి వేడుకలు: రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు





