క్రైమ్ మిర్రర్,ఆన్ లైన్ డెస్క్ : సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్ పైన కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పోలీసులు కోర్టు ముందు హాజరు పరచటం, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్ ను చంచల్ గూడా జైలుకు తరలించారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ తీసుకున్న అల్లు అర్జున్ చంచల్గూడా జైలు నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మళ్లీ కోర్టును ఆశ్రయించారు. అయితే తాజాగా అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది.
Also Read : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు… సంక్రాంతి తర్వాత నియామకం!!!
అల్లు అర్జున్ రెగ్యలర్ బెయిల్ పిటీషన్ పై తీర్పు వాయిదా పడింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నమోదైన కేసులో తనకు రెగ్యులర్ బైలు మంజూరు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్ పిటిషన్ పైన నేడు విచారణ జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన జడ్జి తీర్పును వచ్చే నెల మూడవ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే గత విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు జడ్జిని సమయం కోరిన పోలీసులు ఈరోజు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ బెయిల్ కోసం అల్లు అర్జున్ తరపు నాయవాది, బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
Read Also : తెలంగాణ పోలీస్ కొత్త లోగో.. విడుదల చేసిన తెలంగాణ పోలీసులు
ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును వచ్చేనెల మూడవ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు నాంపల్లి న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించిన క్రమంలో ఈ నెల 27వ తేదీన రిమాండ్ ముగియగా అదే రోజు అల్లు అర్జున్ వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యారు. అప్పుడే అల్లు అర్జున్ తరఫున రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా పడిగా నేడు నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఇక దీనిపై తుది తీర్పును జనవరి మూడవ తేదీన వెల్లడించనున్నట్టు నాంపల్లి కోర్టు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి :
- 12 సంవత్సరాల తర్వాత… బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం
- పదవులకే వన్నే తెచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్.. సీఎం రేవంత్ రెడ్డి
- మన్మోహన్ కు భారతరత్న ఇవ్వడంపై పూర్తిగా మద్దతు తెలుపుతాం: కేటీఆర్
- తొలిసారి టైటిల్ గెలిచిన హర్యానా!… ఎట్టకేలకు నెరవేరిన కోచ్ కళ?
- శభాష్ కోమటిరెడ్డి.. రేవంత్ ఫోన్ తో ఉప్పొంగిన వెంకట్ రెడ్డి