క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించి అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న ఆంటోనిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. డిసెంబర్ 4న పుష్ప2 ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య ధియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా ఆంటోని అని.. పేర్కొంటున్నారు పోలీసులు.. ఈ క్రమంలోనే.. అల్లు అర్జున్ బౌన్సర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనిని సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం సంధ్య థియేటర్‌కి తీసుకెళ్లనున్నారు చిక్కడపల్లి పోలీసులు.
Also Read : దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
అసలు సంధ్య థియేటర్‌లో ఆ రోజు ఏం జరిగింది? అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఎక్కడ కూర్చున్నారు..? తొక్కిసలాట ఎక్కడ జరిగింది..? కారణాలు ఏంటి..? ఆ సమయంలో బౌన్సర్లు ఏం చేశారు.. రేవతి మరణానికి కారణం ఏంటి..? అనే విషయాలపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు.. పోలీసులు.. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆంటోనీతో సహా వారితో కలిసి విచారణ నిర్వహించనున్నారు. కాగా.. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు 18 మందిపై కేసు నమోదు చేశారు.. ఇప్పటికే.. ఈ కేసులో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది.. సుమారు మూడున్నర గంటల పాటు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పగా.. తాను పోలీస్ విచారణకు సహకరిస్తానని బన్నీ తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- జై పాలస్తీనా.. మజ్లిస్ ఎంపీ ఒవైసీకి యూపీ కోర్టు నోటీసులు
- ప్రభుత్వం విఫలమై… అల్లు అర్జున్ ను హైలెట్ చేస్తున్నారు?
- విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీ… 10 రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు
- కేసీఆర్, హరీష్‌రావులకు హైకోర్టులో ఊరట.. ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ
- కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేటీఆర్?