
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :-
బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ వేదికపై ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే.. తన మిత్రుడు,బాలీవుడ్ సూపర్ హీరో ధర్మేంద్ర మరణించిన సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి మంచి అనుబంధాన్ని ఆయన బిగ్ బాస్ వేదికగా ప్రజలకు తెలిపారు. మనం హీ మ్యాన్ ను కోల్పోయామంటూ.. అతని కంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరు అని అనుకుంటున్నాను.. ‘ఉయ్ మిస్ యు ధర్మేంద్ర’ అంటూ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. మా తండ్రి పుట్టినరోజు నాడే ధర్మేంద్ర మరణించారు అని ఎమోషనల్ అయ్యారు. ఇక నిన్న బిగ్ బాస్ 19 విజేతగా గౌరవ ఖన్నా నిలిచిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అతనికి ప్రైజ్ మనీ గా 50 లక్షల రూపాయలు అందించారు. గతంలో దివంగత బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర బిగ్ బాస్ కు వచ్చినటువంటి వీడియోను ప్రదర్శించారు. దీంతో వెంటనే సల్మాన్ ఖాన్ ఎమోషనల్ అయిపోయారు. ఒక మంచి యాక్టర్ ను బాలీవుడ్ కోల్పోయింది.. ధర్మేంద్ర ఎప్పటికీ అభిమానులు గుండెల్లో నిలిచిపోతారు అని సల్మాన్ ఖాన్ ఏడుస్తూనే చెప్పారు. దీంతో సల్మాన్ ఖాన్ ఎమోషనల్ అవుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి వారితో పాటుగా ఈ షోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాధకు గురయ్యారు.
Read also : మల్లారెడ్డి పూలు, పాలు మాత్రమే కాదు.. భూకబ్జాలు కూడా చేశారు : కవిత
Read also : మనిషి ప్రాణం తీసిన చికెన్ ముక్క.. జాగ్రత్త!





